ఆవుపై దాడి చేసిన చిరుత
MDK: జిన్నారం మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఖాజీ తంగేళ్లకుంట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల వేణుకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవతున్నారు. గతం వారం నుంచి కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.