VIDEO: పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
E.G: పోలవరం మండల పరిసరాలలో ఇవాళ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో ఉన్న పంటను వర్షం బారి నుంచి తప్పించేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాలలో పంట దెబ్బతిన్నట్లు రైతులు వాపోయారు. కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలను వర్షంలో తడవకుండా బరకాలు కప్పుతున్నారు.