రెవెన్యూ డివిజన్‌గానే రామచంద్రాపురం: మంత్రి

రెవెన్యూ డివిజన్‌గానే రామచంద్రాపురం: మంత్రి

AP: కోనసిమ జిల్లాలోని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌గానే కొనసాగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందువల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రామచంద్రాపురం డివిజన్ నుంచి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రిలో చేర్చడంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంత్రి క్లారిటీ ఇచ్చారు.