కుడి కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల మండలంలోని నారాయణపురం కుడి కాలువను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శనివారం సాయంత్రం పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, రైతులు, అధికారులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. అనంతరం నారాయణపురం కుడి కాలువ చానల్ నుంచి ఏ ఏ గ్రామాలకు నీరు అందుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.