VIDEO: వార్షిక కళ్యాణోత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో ఈ నెలలో నిర్వహించనున్న స్వామివారి వార్షిక కళ్యాణ్ ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరాజు, డీసీ చక్రధరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై చేపట్టవలసిన కార్యాచరణ పై వారిరువురు అధికారులు చర్చించారు. నిత్య అన్నదాన భవన నిర్మాణ పనులను పరిశీలించారు.