కడియంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే
WGL: వరంగల్ జిల్లాలో అనేక మందిపై బురద చల్లి, రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నేడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాకత్ కుదుర్చుకొని జిల్లాలో పలువురు నేతల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.