పాక్ కాల్పుల్లో మరో జవాన్ మృతి

జమ్మూకాశ్మీర్‌లో మరో జవాన్ మరణించాడు. పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే(29) వీరమరణం పొందాడు. సచిన్ స్వస్థలం మహారాష్ట్ర-తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామం. ఈరోజు ఆయన పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా.. నిన్న ఏపీకి చెందిన మురళీ నాయక్ పాక్ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.