'జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి'

SRPT: తెలంగాణ ప్రభుత్వం రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని అధికారికంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం ఆయన కోరారు.