హైదరాబాద్‌లో ర్యాలీలు.. ఓవైసీపై రాజాసింగ్ ఆగ్రహం

హైదరాబాద్‌లో ర్యాలీలు.. ఓవైసీపై రాజాసింగ్ ఆగ్రహం

హైదరాబాద్‌లో ఇరాన్ నాయకుడి మరణానికి నిరసనగా ర్యాలీలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీకి అంత అభిమానం ఉంటే ఇరాన్ వెళ్లి యుద్ధం చేయాలని, కావాలంటే తానే ఫ్లైట్ టికెట్లు కొనిస్తానని ఎద్దేవా చేశారు. ఇరాన్‌కు అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నవారిని వెంటనే రాష్ట్రం నుంచి అక్కడికి పంపించేయాలని ఆయన డిమాండ్ చేశారు.