కలెక్టర్‌లో బసవేశ్వర జయంతి
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహాత్మ బసవేశ్వరుని జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. మహాత్మ బసవేశ్వరుడు సమానత్వం, న్యాయం, మానవత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు.