ట్రావెల్ బస్సులో 500 కేజీల గోమాంసం..?

ట్రావెల్ బస్సులో 500 కేజీల గోమాంసం..?

ప్రకాశం: సింగరాయకొండ వద్ద ఓ ట్రావెల్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 500 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మాంసాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. అయితే పట్టుకున్నది గోమాంసంగా పోలీసులు అనుమానిస్తున్నారు.