ముగిసిన శ్రీ సత్యసాయి గ్లోబల్ అఖండ భజన
సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన గ్లోబల్ అఖండ భజన ఆదివారం రాత్రి ముగిసింది. 24 గంటల పాటు నిరంతరంగా సాగిన ఈ భజనలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయికుల్వంత్ హాలులో భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారిని కీర్తించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.