ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులు..!

మేడ్చల్: ఉప్పల్ పరిసర ప్రాంతాలైన చిల్కానగర్, బోడుప్పల్, హబ్సిగూడ లాంటి ప్రాంతాల్లో ఉదయం చిరుజల్లులు కురిసాయి. చిల్కానగర్ డివిజన్ కార్యాలయం వద్ద 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లుగా తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. నేడు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలను బయటకు పంపోద్దని అధికారులు సూచించారు.