రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి

రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి

NLG: హుజూర్‌నగర్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరగా.. గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. SI మెహన్ బాబు వివరాల ప్రకారం.. చిలుకూరు PSలో నమోదైన CMRF నిధుల దుర్వినియోగం కేసులో కోదాడకు చెందిన రాజేష్ నిందితుడిగా ఉన్నాడు. శ్వాస సమస్య ఉన్నట్లు జైలు సిబ్బందికి తెలియజేయగా వారు వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.