సంకినేని బ్రాండ్‌కు స్వతంత్ర అభ్యర్థి సవాల్..!
SRPT: తుంగతుర్తి గ్రామపంచాయతీపై 3 దశాబ్దాలుగా సంకినేని కుటుంబందే ఆధిపత్యం. ఈసారి కూడా వారి అనుచరుడుకు బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, BRS పార్టీలు కలిసి ఈ ఆధిపత్యాన్ని చెరపాలని చూస్తున్నాయి. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బొంకూరి అరుణ పోటీలో నిలవబోతున్నారు. ప్రధాన పార్టీలకు సవాల్ విసిరి, స్వతంత్ర అభ్యర్థి దశాబ్దాల చరిత్రకు గండి కొట్టగలరా అన్నది అసలు ప్రశ్న.