'ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి'
PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలో డీసీపీ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ, పరిమితికి మించి ప్రయాణికులను వాహనంలో ఎక్కించుకోవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.