యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి ప్రత్యేక బస్సులు

ఖమ్మం నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు గురువారం ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. ఈప్రత్యేక బస్సు ఆగస్టు 3 ఆదివారం ఉదయం 6:30గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరుతుందన్నారు.పెద్దలకు టికెట్ ధర రూ.700, పిల్లలకు రూ.370గా నిర్ణయించారు. వివరలకు 9136446666, 9951225958, 7382858084 నెంబర్‌లను సంప్రదించాలన్నారు.