బస్సులో భారీగా నగదు పట్టివేత

బస్సులో భారీగా నగదు పట్టివేత

NLR: మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఓ బస్సు నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ నుంచి చెన్నైకు కీర్తి ట్రావెల్స్‌లో బయల్దేరింది. మనుబోలు ఎస్సై రాకేశ్ తన సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో బస్సులో రూ. 34 లక్షలు గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి మహిళ సరైన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.