నగరంలో వంద లీటర్ల వర్షం కురిస్తే భూమిలోకి ఇంకేది రెండే..!

HYD: ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. కానీ, HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోంది.