రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
BDK: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం చింతల గుంపు గ్రామంలో గురువారం తెల్లవారుజామున రెండు బైకులు ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.