87 శాతం విద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లోనే
KMM: జిల్లా విద్యుత్ సర్కిల్ పరిధిలో 87 శాతం బిల్లుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. 2025 నవంబర్ 11 నాటికి 1,67,998 మందిలో 1,54,170 మంది ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. పారదర్శకమైన, నమ్మకమైన చెల్లింపులు అయినందున మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.