మార్కెట్ కమిటీ సభ్యుడు గుండెపోటుతో మృతి

BHPL: కాటారం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యుడు పసుల కోటేష్ (27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, కూరగాయల వ్యాపారులు తెలిపారు. ఆయన అకాల మరణం పట్ల స్థానిక వ్యాపారులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటేష్ సేవలను కొనియాడారు.