BRSV ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులు
MDCL: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా BRSV ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం BRSV నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.