'ఎన్నికల సిబ్బంది తరలింపుపై సమీక్ష'
NRML: జిల్లా జనరల్ ఆబ్జర్వర్ ఐయేష మస్రత్ ఖానం బుధవారం పెంబి మండలంలోని యాపాలగూడ గ్రామపంచాయతీని సందర్శించారు. నదిని దాటి పోలింగ్ బూత్‌కి చేరుకునే మార్గాన్ని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. థర్మాకోల్ పడవల ద్వారా సిబ్బంది తరలింపుపై అధికారులు చేసిన ఏర్పాట్లను సమీక్షించిన ఆమె, తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రవాణా, భద్రత, లైఫ్ జాకెట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.