VIDEO: గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగసిపడిన మంటలు

VIDEO: గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగసిపడిన మంటలు

E.G: కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలో సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో లీక్ అయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు వెంటనే గ్యాస్ రవాణా నిలుపుదల చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.