వీధి కుక్కల వీరంగం.. భయం గుప్పిట్లో జనం!
VKB: దౌలతాబాద్ మండల వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పలు గ్రామాల్లో కుక్కల బెడద మితిమీరిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులకు యత్నిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి, కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.