తిరుమలలో భక్తుల రద్దీ ఇలా

TPT: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, కంపార్టుమెంట్లు అన్ని నిండి బయటవైపు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న(గురువారం) 65,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 27,331 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.