గ్రామ దేవతల స్థలాలను కాపాడాలని వినతి
KDP: సిద్దవటం మండలం మాధవరం–1SKR నగర్ శివారులోని సర్వే నెం.1069/2 భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు శుక్రవారం రాజంపేట TDP ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజుకు వినతిపత్రం అందజేశారు. గత 30 ఏళ్లుగా గ్రామ దేవతల పూజా కార్యక్రమాలు అదే స్థలంలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చమర్తి హామీ ఇచ్చారు.