VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి నది

MBNR: జడ్చర్ల మండలంలోని నెక్కొండ చెక్ డ్యాం వద్ద దుందుభి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం అధికంగా ఉన్నందున, ప్రజలు చెక్ డ్యాం వద్దకు రావద్దని నెక్కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి నసరుద్దీన్ సూచించారు. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.