ముగిసిన భూలోక మాత ఉత్సవాలు

VZM: గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో భూలోక మాత ఉత్సవాలు నేడు ఆదివారం ముగింపు. అమ్మవారిని దర్శించుకునేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఘటాలు జ్యోతికలశాలను భక్తులు శిరస్సును ధరించి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.