జిల్లాలో ఏప్రిల్ 1న సీఎం పర్యటన: కలెక్టర్

జిల్లాలో ఏప్రిల్ 1న సీఎం పర్యటన: కలెక్టర్

NLR: వింజమూరు మండలంలో ఏప్రిల్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న సీఎం, ముందుగా నార్త్ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.