వైసీపీ జిల్లా కార్యదర్శిగా పోలార్పు నరేష్ నియామకం
ATP: జిల్లా YCP కార్యదర్శిగా ఇటీవల నియమితులైన పోలార్పు నరేష్ మాజీ ఎంపీ తలారి రంగయ్యను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు రంగయ్యకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రంగయ్య ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.