VIDEO: ఆగని అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం
KMM: మధిర మండలం ఆత్కూరు సమీపంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మంటలు రెండో చాంబరకు వ్యాపించడంతో వేలాది మిర్చి బస్తాలు దగ్ధమవ్వడంతో పాటు, కోల్డ్ స్టోరేజ్ కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.