ఘనంగా ఉప సర్పంచ్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి బుధవారం పలువురు ముస్లిం నాయకులు షేక్ గులాం భాష, మస్తాన్, ఆరిఫ్, గౌస్ పీర్, అబ్దుల్ రెహమాన్ ఆయనను సెలవుతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రజా నాయకుడు ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరని తెలియజేసారు.