మానవత్వం చాటుకున్న కలెక్టర్
VZM: జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తుఫాన్ ప్రభావిత మండలాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా గజపతినగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపించి, స్వయంగా దిగి, గాయపడిన వ్యక్తుల వద్దకు చేరుకున్నారు. బాధితుల స్థితిని తెలుసుకుని, అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించి తక్షణం ఆసుపత్రికి తరలించారు.