శక్తి పథకం అమలుపై జిల్లా అధికారి ఆరా

శక్తి పథకం అమలుపై జిల్లా అధికారి ఆరా

VSP: జిల్లాలో అమలవుతున్న శ్రీ శక్తి పథకం అమలుతీరును జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు పరిశీలించారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులో ఈ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ద్వారకా బస్ స్టేషన్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.