VIDEO: తల్లీబిడ్డలను కాపాడిన పోలీసులు
PLD: నరసరావుపేట గుంటూరు రోడ్డు ఫ్లైఓవర్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలిసి బంధువులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై కిషోర్ బృందం లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి చేరుకున్నారు. తల్లీబిడ్డలను సకాలంలో సురక్షితంగా కాపాడారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.