పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

NLR: జిల్లా పొదలకూరు రోడ్డు గౌతమి నగర్ రెండో వీధిలో మానసిక దివ్యాంగురాలు భానుశ్రీకి కలెక్టర్ ఆనంద్ రూ.15 వేల పింఛన్ అందజేశారు. ఆ తర్వాత చిన్నారితో ఆయన ముచ్చటించారు. భానుశ్రీ తల్లి కామాక్షమ్మతో మాట్లాడి చిన్నారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భానుశ్రీని భవిత కేంద్రంలో చేర్పించి చదివించాలని సూచించారు.