VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
WNP: పెబ్బేరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్ కొల్లాపూర్‌కు చెందిన ప్రవీణ్ వీరిద్దరు కలిసి పెబ్బేరుకు బైక్ పై వస్తుండగా బైపాస్ కూడలి నందు హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.