మృతుల కుటుంబాలకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సహాయం

NLG: నల్గొండ పట్టణం మాన్యంచల్కకి చెందిన నవాజ్, జుబేర్ ఆదివారం తెల్లవారుజామున పెదకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ద్వారా చెరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.