ఐచర్, బైక్ ఢీకొని ఒకరి మృతి..!
అనంతపురం: నార్పల మండలం బొందలవాడ సమీపంలో బుధవారం ఐచర్, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో చిలమత్తూరు మండలం కోడూరుకు చెందిన శీను(38) అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై కూలీ పనుల నిమిత్తం నార్పలకు వచ్చి, పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.