పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో PM సూర్యఘర్ పథకాన్ని MLA నక్కా ఆనంద్‌బాబు ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని SC, ST వినియోగదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.1.25 లక్షల వ్యయంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.