పుట్టపర్తిలో ఎమ్మెల్యే గ్రీవెన్స్‌కు భారీ స్పందన

పుట్టపర్తిలో ఎమ్మెల్యే గ్రీవెన్స్‌కు భారీ స్పందన

సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌కు అనూహ్య స్పందన లభించింది. రెవెన్యూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు రావడంతో, తక్షణమే వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆస్తి వివాదాలు, కొత్త పెన్షన్లు, పక్కా గృహాల మంజూరు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు.