సలేశ్వరం జాతర భక్తులకు కీలక సూచనలు

సలేశ్వరం జాతర భక్తులకు కీలక సూచనలు

NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతర భక్తులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు. వాహనాలను నిర్ణీత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని, టైగర్ రిజర్వ్ పరిధిలో వంటలు చేయడం, మద్యం తాగటం, ప్లాస్టిక్ పారేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు. భక్తులు క్యూ పద్ధతి పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.