నారాయణ గురు 169వ జయంతి వేడుకలు

కర్నూలులో ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో సామాజిక సంఘ సంష్కర్త నారాయణ గురు 169వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసారని పేర్కొన్నారు.