బ్యాండేజ్‌తో పరీక్షకు హాజరైన విద్యార్థి

బ్యాండేజ్‌తో పరీక్షకు హాజరైన విద్యార్థి

అనకాపల్లి: దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పెద గంగవరం గ్రామానికి చెందిన పెనగంటి ఉపేంద్ర శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష రాసి ఇంటికి వెళ్లాడు. ఇంటి దగ్గర గోడపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో కుడి చెయ్యి విరిగింది. దీంతో చేతికి సిమ్మెంటు కట్టు కట్టించారు. సోమవారం తెనుగుపూడిలో గణితం పరీక్ష రాయాల్సి ఉండటంతో వేరొకరి సాహయంతో రాశాడు.