పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్పీ పరిశీలన
ATP: జిల్లా ఎస్పీ పీ.జగదీష్ శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)ను సందర్శించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 98 మంది కానిస్టేబుళ్ల శిక్షణా తరగతుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. శిక్షణ సమర్థవంతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.