రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ గాయాలు
NLR: వలేటివారిపాలెం మండలం పరిధిలోని అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య జాతీయ రహదారి 167పై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.