VIDEO: తాంసి బీజేపీ నాయకుల నిరసన

ADB: ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాంసి మండల బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఆదివారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా సీఐ ఫణిదర్, ఎస్సై జీవన్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్ర కిరణ్, నాయకులు సదానందం తదితరులు ఉన్నారు.