'అడవులను సంరక్షించుకుంటూనే అభివృద్ధి పనులు చేపట్టాలి'

'అడవులను సంరక్షించుకుంటూనే అభివృద్ధి పనులు చేపట్టాలి'

KMM: అడవులను సంరక్షించుకుంటూనే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అవసరమైన మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం రఘునాధపాలెం మండలం దొనబండలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామంలో అవసరమైన డొంక రోడ్లను నెల రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.